Ranveer singh: ఇంటర్నేషనల్ లెవల్లో ‘ప్రళయ్’.. రణవీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్
ధురంధర్ తరువాత జాంబీ కాన్సెప్ట్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న రణవీర్ సింగ్(Ranveer singh).
- V Santhosh Kumar
- Published On : April 3, 2026 / 11:17 AM IST
ranveer singh new movie pralay
- డాన్ 3కి రణవీర్ గుడ్ బై
- ప్రళయ్ పేరుతో గ్లోబల్ లెవల్ మూవీ
- జాంబీ థ్రిల్లర్ తో రణవీర్ కొత్త సాహసం
Ranveer singh: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో రణవీర్ కనబరిచిన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గాను ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘ధురంధర్ 2’ ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లను రాబట్టి, భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
shraddha srinath: బోల్డ్ లుక్‌లో మెరిసిపోతున్న శ్రద్ధా శ్రీనాథ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్
దీంతో, రణవీర్ సింగ్ (Ranveer singh)తదుపరి సినిమాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన ‘డాన్ 3’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘డాన్ 3’ను పక్కన పెట్టి, రణవీర్ ఇప్పుడు ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడట. ఇది పూర్తిగా జాంబీ నేపథ్యంలో సాగే సినిమా అని, మునుపెన్నడూ చూడని రీతిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం.
ఈ ‘ప్రళయ్’ చిత్రాన్ని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
