Ranveer Singh: చట్టపరమైన చర్యలకు సిద్ధం.. ఫిల్మ్ ఫెడరేషన్ కు లీగల్ నోటీసులు పంపించిన రణ్‌వీర్ సింగ్
ఫిల్మ్ ఫెడరేషన్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh).
- V Santhosh Kumar
- Updated on- June 3, 2026 / 11:08 AM IST
Ranveer Singh sends legal notice to Film Federation regarding the ban imposed on him.
- సంస్థకు రణ్‌వీర్ లీగల్ నోటీసులు.
- రూ.45 కోట్ల ప్రీప్రొడక్షన్ నష్టం.
- వివాదంపై రణ్‌వీర్ టీమ్ స్పందన.
Ranveer Singh: బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘డాన్ 3’ వివాదం రోజురోజుకూ ముదురుతూ చివరకు కోర్టు మెట్లెక్కింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాల్సిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రాజెక్ట్ నుండి మధ్యలోనే తప్పుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంస్థ రణ్‌వీర్‌పై నిషేధం విధించింది. ఈ చర్యను సవాలు చేస్తూ రణ్‌వీర్ సింగ్ మంగళవారం ఆ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు.
Kollywood: ఎస్ జె సూర్య ‘కిల్లర్’ షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి వ్యక్తి మృతి
రణ్‌వీర్ సింగ్ చర్చలకు సహకరించకపోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ గతంలో పేర్కొంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల నిర్మాతలకు దాదాపు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు ఎవరూ రణ్‌వీర్‌తో కలిసి పనిచేయకూడదని ఆదేశించింది. తమకు లీగల్ నోటీసులు అందిన విషయాన్ని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రతినిధి అశోక్ పండిట్ ధ్రువీకరించారు. దీనిపై ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
మరోవైపు ఈ తీవ్ర వివాదంపై రణ్‌వీర్ సింగ్ బృందం స్పందించింది. రణ్‌వీర్(Ranveer Singh)కు తన వృత్తి పట్ల, పరిశ్రమ పట్ల అపారమైన గౌరవం ఉందని వెల్లడించింది. సినిమా బాగా రావాలనే ఉద్దేశంతోనే ఆయన ఇప్పటివరకు ఈ వివాదంపై మౌనంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే రణ్‌వీర్ లీగల్ నోటీసుల వ్యవహారంతో ఈ వివాదం బాలీవుడ్‌లో మరింత వేడెక్కింది. సాయంత్రం జరగబోయే ప్రెస్‌మీట్‌లో ఏం తేలనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
