Sj Suryah Killer Set Fire: ఎస్ జె సూర్య ‘కిల్లర్’ షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి వ్యక్తి మృతి
SJ Suryah Killer Set Tragedy: కోలీవుడ్(Kollywood) హీరో ఎస్ జె సూర్య కిల్లర్ మూవీ షూటింగ్ లో అగ్నిప్రమాదం.
Fire accident at sj surya killer movie shooting sets
- ‘కిల్లర్’ షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.
- సిలిండర్ పేలి ఒకరు అక్కడికక్కడే మృతి.
- పది మందికి పైగా సిబ్బందికి గాయాలు.
Sj Suryah: కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్లో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై(Kollywood) ఒట్టేరి పరిసరాల్లోని ప్రముఖ బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సెట్స్‌లో ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ఆకస్మిక ప్రమాదం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సిలిండర్ పేలుడు తీవ్రతకు మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సిబ్బందికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. వీరితో పాటు మరో పది మందికి పైగా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దురదృష్టకర సంఘటన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం నుండి ఎస్ జె సూర్యతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు సురక్షితంగా బయటపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
