Mahhi Vij : రేప్ చేస్తా అంటూ.. టీవీ నటికి పబ్లిక్‌గా బెదిరింపులు..
బాలీవుడ్ కి చెందిన ఓ టీవీ నటిపై రేప్ చేస్తా అంటూ పబ్లిక్ గా బెదిరించాడు ఓ ప్రబుద్దుడు. బాలీవుడ్ యాంకర్, టీవీ నటి మహి విజ్ ముంబైలో కార్లో తన ఇంటికి..................
- Saketh U
- Published on- May 9, 2022 / 09:54 AM IST
Mahhi Vij
Mahhi Vij : బాలీవుడ్ కి చెందిన ఓ టీవీ నటిపై రేప్ చేస్తా అంటూ పబ్లిక్ గా బెదిరించాడు ఓ ప్రబుద్దుడు. బాలీవుడ్ యాంకర్, టీవీ నటి మహి విజ్ ముంబైలో కార్లో తన ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి తన కార్ ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతనే కార్ దిగి వచ్చి మహిపై తిట్లు మొదలు పెట్టాడు. అతనిది తప్పు ఉన్నా మహిని తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో రోడ్డు మీద నానా హంగామా సృష్టించాడు అతను. అయితే ఇదంతా వీడియో తీయడానికి ప్రయత్నించినా ఆ వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే అతని కార్ నుంబర్ కనపడేలా ఓ వీడియో తీసింది మహి.
Mahesh Babu : మహేష్‌తో సినిమా చేస్తే సన్నబడాల్సిందే..
ఆ కార్ నంబర్ ఉన్న వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ”ఈ కార్ కి సంబంధించిన వ్యక్తి నా కారును ఢీ కొట్టాడు. పైగా నన్నే రేప్ చేస్తా అంటూ బెదిరించాడు. అప్పుడు కార్ లో నా కూతురు కూడా ఉంది. నాకు చాలా భయం వేసింది. అతని నా పై దాడికి కూడా దిగాడు. దయచేసి ఇతన్ని కనిపెట్టి శిక్షించాలి” అంటూ ముంబై పోలీసులని ట్యాగ్ చేసింది. అయితే మహి చేసిన ఈ ట్వీట్ కి ముంబై పోలీసులు స్పందించి “దయచేసి మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీ కంప్లైంట్ ఇవ్వండి” అని రిప్లై ఇచ్చారు. దీంతో అక్కడకు దగ్గర్లో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ టీవీ నటి.
