OTT: ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే మైండ్ పోతుంది.. తెలుగులో కూడా చూడొచ్చు
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్(OTT) కి వచ్చేసిన బాలీవుడ్ లేటెస్ట్ క్రైం థ్రిల్లర్ 'లుక్కే' వెబ్ సిరీస్.
- V Santhosh Kumar
- Updated on- May 11, 2026 / 08:54 PM IST
rashi khanna Lukkhe web series now steaming on amazon prime
-
ఓటీటీలో దూసుకుపోతున్న లుక్కే క్రైమ్ సిరీస్
-
ర్యాపర్ కింగ్, రాశీ ఖన్నా ప్రధానపాత్రలు
-
పంజాబ్ ర్యాప్, డ్రగ్స్ మాఫియా కథనం
OTT: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ హవా నడుస్తోంది. అందులో కూడా హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు, సిరీస్ లకు ఆడియన్స్ బాగా అలవాటు పడిపోయారు. అలా ఈవారం ఓటీటీ(OTT)లోకి వచ్చిన సిరీస్ నే ‘లుక్కే’ (Lukke). ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 నుండి అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్, పంజాబ్, ఢిల్లీలోని ర్యాప్ కల్చర్, డ్రగ్స్ మాఫియా, పగ నేపథ్యంలో సాగుతుంది. కొందరు యువ కళాకారులు ఊహించని విధంగా నేర ప్రపంచంలోకి ఎలా వెళ్లాల్సి వచ్చిందనే అంశాన్ని దర్శకుడు హిమాంక్ గౌర్ అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఆద్యంతం ట్విస్టులతో సాగే ఈ కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తూ, ఐఎండిబి (IMDb) లోనూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది.
Kayadu Lohar: చీరలో కాయదు సోయగం.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ ఫోటోలు
ఈ సిరీస్ ద్వారా ప్రముఖ ర్యాపర్ కింగ్ నటుడిగా పరిచయం కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కీలక పాత్రలో మెరిశారు. శివాంకిత్, పాలక్ తివారీ వంటి నటుల ప్రతిభ ఈ క్రైమ్ డ్రామాకు మరింత బలాన్ని ఇచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ట్రెండింగ్‌లో ఉంది. రొటీన్ కథలకు భిన్నంగా, మ్యూజిక్, క్రైమ్ ఎలిమెంట్స్ కలగలిసిన కొత్త తరహా థ్రిల్లర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ‘లుక్కే’ ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు.
