×
Ad

Rashi Khanna: అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం.. చాలా కామెంట్స్ చేశారు.. ఇదే సమాధానం అవుతుంది..

స్టార్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రతేకమైన పరిచయం అవసరం లేదు.(Rashi Khanna0 మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో ఆమె హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత బ్లాక్ బస్టర్ "మనం" సినిమాలో చిన్న పాత్ర చేసింది.

Rashi Khanna shocking comments on 120 Bahadur movie

Rashi Khanna: స్టార్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రతేకమైన పరిచయం అవసరం లేదు. మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో ఆమె హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత బ్లాక్ బస్టర్ “మనం” సినిమాలో చిన్న పాత్ర చేసింది. (Rashi Khanna)అలా మొదలైన రాశి ఖన్నా తరువాత వరుస అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో టాప్ స్టార్స్ తో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నుంచి వచ్చిన సినిమా తెలుసు కదా. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత రాశి ఖన్నా నుంచి వస్తున్న సినిమా “120 బహదూర్”.

Chinmayi: సింగర్ చిన్మయి పై ట్రోలింగ్.. పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి

రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భాటి జీవితకథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ తెరకెక్కితున్న ఈ సినిమాలో రాశి ఖన్నా మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భాటి భార్య షాగున్‌ సింగ్‌ పాత్రలో నటించింది. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి.. సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. “120 బహదూర్ సినిమా నాకు చాలా ప్రత్యేకం.

ఆర్మీ సైనికుడి భార్యగా నటించడం అంత సులభం కాదు. యుద్దానికి వెళుతున్న భర్త తిరిగిరాడు అని తెలిసి భాధ, మరోవైపు భాద్యతను ఒకేసారి చూపించాలి. ఆ పాత్రను చాలా అర్థం చేసుకొని అందులోకి వెళ్లి నటించాల్సి వచ్చింది. ఇంతకాలం రాశి ఖన్నా అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అని కామెంట్స్ వినిపించేవి. ఈ సినిమా అలాంటి కామెంట్స్ కి సమాధానం చెప్తుంది” అంటూ చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ఈ సినిమా తరువాత తెలుగులో రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.