Rashi Singh : పెళ్లి చేసుకుంటాను.. అలాంటి అబ్బాయి దొరికితే.. పెళ్లిపై రాశి సింగ్ కామెంట్స్..
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రెస్టారెంట్ బిజినెస్ కూడా మొదలుపెట్టి సక్సెస్ అయింది రాశి సింగ్.(Rashi Singh)
- Saketh U
- Updated on- June 18, 2026 / 01:38 PM IST
Rashi Singh
Rashi Singh : టాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చుకుంది హీరోయిన్ రాశి సింగ్. చత్తిస్త్‌ఘడ్ కి చెందిన ఈ భామ ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలుపెట్టి శశి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అక్కడుంచి వరుసగా టాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతూ ఉంటుంది.
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రెస్టారెంట్ బిజినెస్ కూడా మొదలుపెట్టి సక్సెస్ అయింది రాశి సింగ్. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు లో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతుండగా నేడు మీడియాతో రాశి సింగ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి కూడా తెలిపింది.
Also Read : Venkatesh kalyan Ram : వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
రాశి సింగ్ మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకుంటాను. హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి లేదా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నేను ప్యూర్ వెజిటేరియన్. తను కూడా వెజిటేరియన్ అయితే మంచిది. నేను ఇక్కడే టాలీవుడ్ లోనే, హైదరాబాద్ లోనే సెటిల్ అవుతాను. అందుకే హైదరాబాద్ లో ఉండే మంచి అబ్బాయి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.
