Rashmi Gautam : అమ్మాయిల హార్ట్ బ్రేక్స్ పై సినిమాలు కావాలంటున్న రష్మీ.. సుధీర్‌తో ప్రేమ బ్రేకప్..!
ఇటీవల రష్మీ చేస్తున్న వరుస కామెంట్స్ చూస్తుంటే సుధీర్‌తో ప్రేమ నిజమే అనిపిస్తుంది. తాజాగా ఒక ఈవెంట్‌లో..
- gum 95921
- Published On : August 21, 2023 / 03:08 PM IST
Rashmi Gautam comments is about break up with Sudigali Sudheer
Rashmi Gautam : టాలీవుడ్ లో రష్మీ అండ్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) జంటకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై ఈ జంట కెమిస్ట్రీ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. ఇక రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ జంటగా ఉంటారని అందురు అనుకున్నారు. కానీ వీరిద్దరి నిజంగా ప్రేమలో ఉన్నారా? లేదా? అనే సందేహం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈ మధ్య రష్మీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారని అర్ధమవుతుంది.
Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే థియేట్రికల్ సినిమాలు ఇవే..
“స్క్రీన్ పై మా రిలేషన్ ఎలా ఉంటుందో, బయట కూడా అలాగే ఉంటుంది. నిజం తెలియాల్సిన సమయంలో కచ్చితంగా తెలుస్తుంది” అంటూ ఇలా రష్మీ చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ ఆలోచించేలా చేస్తుంది. ఇటీవల ఒక టీవీ షోలో సుధీర్ ని ఉద్దేశిస్తూ.. “నన్ను ఎందుకు వదిలేశావు” అంటూ రష్మీ కామెంట్స్ చేసింది. తాజాగా ఒక మూవీ ఈవెంట్ లో రష్మీతో పాటు పాటు బేబీ (Baby) మూవీ నిర్మాత SKN కూడా పాల్గొన్నాడు.
Salman Khan : సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూశారా? గుండు బాస్.. షారుఖ్ లాగే సినిమా కోసమో?
ఇక ఈ కార్యక్రమంలో రష్మీ మాట్లాడుతూ మొదటు చెప్పిన వ్యాఖ్యలు.. “SKN గారు బేబీలో మగవాళ్ల బాధని చూపించారు. అమ్మాయిల హార్ట్ కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది. మాకు లోపల చాలా బాధ ఉంది” అంటూ రిక్వెస్ట్ చేసి, ఆ తరువాత ఆ ఈవెంట్ కి సంబంధించిన స్పీచ్ లోకి వెళ్ళింది. ఇక ఈ వ్యాఖ్యలు కూడా విన్న నెటిజెన్స్ సుధీర్ తో రష్మీ బ్రేకప్ అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి రష్మీ అండ్ సుధీర్ మధ్య నిజంగానే ప్రేమ ప్రయాణం జరిగి ముగిసిపోయిందా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక ఇటు రష్మీ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంటే అటు సుధీర్ సినిమా ఛాన్సులు రావడంతో టెలివిజన్ కి గుడ్ బై చెప్పేసి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
