Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక తొలి బర్త్ డే.. తండ్రి ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
కూతురి కోసం కోట్లు విలువ చేసే 'సెరినిటీ' బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చిన రష్మిక(Rashmika Mandanna) తండ్రి.
- V Santhosh Kumar
- Published On : April 11, 2026 / 03:49 PM IST
rashmika father gifts multi crore serenity bungalow to his daughter
- రష్మిక 30వ పుట్టినరోజు స్పెషల్
- రష్మికకు లగ్జరీ బంగ్లా కానుక
- కూతురి కోసం కోట్లు విలువ చేసే ‘సెరినిటీ’ బంగ్లా
Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక మందన్న జరుపుకున్న తొలి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా సాగాయి. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న ఆమె, తన 30వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టింట్లో ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేసుకుంది. కొడవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో రష్మిక తన కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసింది. ఈ అపురూపమైన క్షణాలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Kushitha Kallapu: నడుమందాలతో మైమరపిస్తున్న సోషల్ మీడియా బ్యూటీ.. ఖుషిత గ్లామర్ షో
ఈ పుట్టినరోజున రష్మిక తండ్రి ఆమెకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. విరాజ్ పేటలో ‘సెరినిటీ’ పేరుతో ఉన్న ఒక విలాసవంతమైన బంగ్లాను ఆమెకు కానుకగా అందించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఇల్లు, బిజీ షూటింగ్‌ల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఈ స్టార్ జంటకు ఎంతో (Rashmika Mandanna)ఉపయోగపడనుంది. తండ్రి ఇచ్చిన ఈ ఖరీదైన బహుమతి రష్మికకు ఈ పుట్టినరోజును మరింత గుర్తుండిపోయేలా చేసింది.
తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, స్కూల్ మరియు ఆలయ సందర్శన ఫొటోలను రష్మిక షేర్ చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి ఈ వేడుకను జరుపుకుంది. అయితే తన భార్య పుట్టినరోజుకు విజయ్ దేవరకొండ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడనే విషయంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ స్టార్ కపుల్ పెళ్లి తర్వాత జరుపుకున్న ఈ మొదటి పుట్టినరోజు వేడుక నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
