Rashmika – Anand : నీ యబ్బ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. రష్మికని ఆడేసుకున్న విజయ్ తమ్ముడు..

గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.

Rashmika Mandanna and Anand Deverakonda Cute Conversation in Gam Gam Ganesha Event goes Viral

Rashmika – Anand Deverakonda : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గం గం గణేశా'(Gam Gam Ganesha) సినిమాతో మే 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో ఉందని వార్తలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. రష్మిక రెండోసారి ఆనంద్ సినిమా ప్రమోషన్స్ కోసం రావడంతో ఈ ఈవెంట్ పై అందరికి ఆసక్తి ఏర్పడింది.

ఇక ఈవెంట్లో రష్మికని పలు ప్రశ్నలు అడిగాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల రష్మిక పలు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిలో రష్మిక పెట్ డాగ్, విజయ్ పెట్ డాగ్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలు చూపించి వాటిలో ఏది ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పడం గమనార్హం.

Also Read : NTR – Kalyan Ram : 101వ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

అలాగే నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అని అడగడంతో రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని ఆనంద్ ని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా, ఇలా స్పాట్ లో పెడితే ఎలా అని చెప్పడంతో అక్కడ వచ్చిన అభిమానులంతా అరుపులతో సందడి చేసారు. అయితే ఈవెంట్ కి వచ్చిన జనాలు అంతా రౌడీ, రౌడీ స్టార్ అని అరవడంతో రష్మిక.. రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్ ని ఉద్దేశించి చెప్పింది. ఇలా ఈవెంట్ సరదాగా సాగడంతో రష్మిక – ఆనంద్ మాటలు వైరల్ అవుతున్నాయి. ఆనంద్ ని నువ్వు నా ఫ్యామిలిరా అని చెప్పడంతో విజయ్, రష్మిక ఎంత క్లోజ్ అనేది మరోసారి తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.

ఇక ఈ గం గం గణేశా సినిమా ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రలు చేశారు.ఇప్పటికే గం గం గణేశా సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు