Rashmika Mandanna : విజయ్ దేవరకొండకి రష్మిక పెట్టుకున్న.. ముద్దు పేరు ఏంటో తెలుసా..?
విజయ్ దేవరకొండకి రష్మిక పెట్టుకున్న ముద్దు పేరు ఏంటో తెలుసా..? రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని..
- gum 95921
- Published On : April 4, 2024 / 07:01 PM IST
Rashmika Mandanna calls vijay Deverakonda with that nickname
Rashmika Mandanna : టాలీవుడ్ ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమా లేదా స్నేహమా అనేది ఆడియన్స్ కి ఒక వీడని చిక్కు ముడిలా మారిపోయింది. కానీ వీరిద్దరి యాక్షన్స్ చూస్తే మాత్రం.. ప్రేమలో ఉన్నారు అనే భావనే కలుగుతుంది. కాగా తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రష్మిక, విజయ్ కి పెట్టుకున్న నిక్ నేమ్ ని తెలియజేసారు.
బాలీవుడ్ లో నేహా ధుపియా నిర్వహించే పోడ్‌కాస్ట్ లో రష్మిక పాల్గొన్నారు. ఈ పోడ్‌కాస్ట్ లో రష్మిక తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినిమాలు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈక్రమంలోనే విజయ్ ని ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తారు అని నేహా ధుపియా ప్రశ్నించగా, రష్మిక బదులిస్తూ.. ‘విజ్జు’ అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Ajay devgn : ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్.. వీటిలో మూడు మన సౌత్ సినిమాలే..
ఇక ఇదే పోడ్‌కాస్ట్ లో రష్మిక, విజయ్ గురించి మాట్లాడుతూ.. “విజయ్ ఎంత వర్క్ లో ఉన్నా ఫోన్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. వృత్తిపరంగా ఎన్నో విలువైన సలహాలు ఇస్తూ మంచి థెరపిస్ట్‌గా ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా రేపు ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే. ఇక ఇదే రోజున విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కూడా రిలీజ్ అవ్వడం విశేషం. ఈ సినిమాలో రష్మిక కూడా గెస్ట్ రోల్ చేసినట్లు సమాచారం. మరి రష్మిక నిజంగానే గెస్ట్ రోల్ చేసిందా లేదా అనేది తెలియాలంటే రేపు సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇలా ఉంటే రష్మిక బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విజయ్ ముంబై వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
