Rashmika Mandanna destination is Vijay Deverakonda photo location
Rashmika – Vijay Deverakonda : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఏదో విధంగా ట్రేండింగ్ లో ఉండాల్సిందే. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా అనేది తెలియడం లేదు. ఇద్దరం మంచి స్నేహితులం అని వాళ్ళు చెబుతున్నప్పటికీ.. ఆడియన్స్ మాత్రం వారిని ప్రేమికులు గానే చూస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా చూపిస్తూ వస్తున్నారు. విజయ్ అండ్ రష్మిక తమ హాలిడే ట్రిప్ కి సంబంధించిన పిక్స్ ని విడివిడిగా షేర్ చేసినప్పటికీ.. వాటిలో కొన్ని పోలికలు చూపిస్తూ ఇద్దరు కలిసే వెళ్లారంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా అలాంటి ఒక విషయమే జరిగింది. రష్మిక రీసెంట్ గా ఒక ఫోటో షేర్ చేసింది. ఆ పిక్ లో ఉన్న లొకేషన్ తన డెస్టినేషన్ అని, దానిని వెతుకుంటూ వెళ్తున్నాను అంటూ ఒక వీడియో కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. ఆల్రెడీ ఆ డెస్టినేషన్ లో విజయ్ దేవరకొండ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్ విజిట్ చేసిన ప్లేస్ నే రష్మిక వెతుకుంటూ వెళ్ళింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెట్టింట ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also read : Lokesh Kanagaraj : LCUలో ఆ క్యారెక్టర్స్‌తో కూడా మూవీస్.. రజినీకాంత్ సినిమాలోని ఒక సీక్వెన్స్ కోసం..
Wow pic.twitter.com/OrmWOMBuNe
— Johnnie Walker (@roopezh_) October 7, 2023
ఇక వీరిద్దరూ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఈ ఇద్దరు మళ్ళీ కలిసి నటించబోతున్నారని టాక్ వినిపించింది. గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ VD12 మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుందని, ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చిందని టాక్ వినిపించింది. అయితే అందులో నిజం లేదని, విజయ్ సినిమా కోసం రష్మికని ఏం కాంటాక్ట్ చేయలేదని నిర్మాతలు తెలియజేశారు. దీంతో వీరిద్దరి కామన్ ఆడియన్స్ కొంచెం నిరాశ చెందారు.