Rashmika Mandanna : అప్పుడు మోకాళ్ళ నొప్పితో డాక్టర్ ని కలిసిన రష్మిక.. పెళ్లి తర్వాత మళ్ళీ..
విజయ్ - రష్మిక రిసెప్షన్ కి ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి హాజరయ్యారు. (Rashmika Mandanna)
- Saketh U
- Updated on- March 9, 2026 / 10:46 AM IST
Image Credits : Gurava Reddy Instagram
Rashmika Mandanna : ఇటీవలే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా భారీగా నిర్వహించగా సినీ పరిశ్రమతో పాటు అనేక రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ – రష్మిక రిసెప్షన్ కి ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి హాజరయ్యారు.
ఆర్థోపెడిక్ సర్జన్ గా, రచయితగా, సోషల్ మీడియా సెలబ్రిటీగా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు గురువా రెడ్డి. విజయ్ రష్మిక రిసెప్షన్ కి హాజరయి అక్కడ వారితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర విషయం తెలిపారు.
గురువారెడ్డి తన సోషల్ మీడియాలో రష్మికతో దిగిన ఫోటో షేర్ చేసి.. సామి సామి అంటూ స్టెప్పులు వేసి మోకాళ్ళ నొప్పితో కొన్నేళ్ల క్రితం నన్ను కలిసింది రష్మిక మందన్న. ఇప్పుడు నన్ను రిసెప్షన్ కి ఆహ్వానించింది. రిసెప్షన్ కి వెళ్ళినప్పుడు సంగీత్ లో విపరీతంగా డాన్సులు వేసి మళ్ళీ మోకాళ్ళు పట్టుకున్నాయి. ఈసారి నేనొక్కదాన్నే కాదు మరో పేషెంట్ కూడా వస్తాడు అంటూ విజయ్ ని చూపించింది. ఆ అలసిన మోకాళ్ళ బాధ్యత నాదే అంటూ పోస్ట్ చేసారు.
Also Read : Sushmita Konidela : బాబాయ్ భయపెట్టేవాడు.. పవన్ కళ్యాణ్ పై చిరు కూతురు కామెంట్స్ వైరల్..
