Rashmika Mandanna: కాళ్లకు గాయాలు.. ఎన్నో జ్ఞాపకాలు.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్
మైసా సినిమా షూటింగ్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక మందన్న(Rashmika Mandanna).
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 05:03 PM IST
Rashmika Mandanna emotional post about mysaa movie shooting
- ఎత్తుల భయాన్ని జయించిన రష్మిక
- డూప్ లేకుండా భారీ సాహసం
- గాయాలైనా ఆగని మైసా షూటింగ్
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కొచ్చిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక తనలోని అతిపెద్ద బలహీనతను అధిగమించి, సాహసోపేతమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారట. భారీ ఎత్తులను చూసి భయపడే (Acrophobia) ఆమె తన ఫోబియాను ఈ సినిమా షూటింగ్ లో ధైర్యంగా జయించారు. ఈ సినిమా కోసం ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి డూప్ లేకుండా దూకి రష్మిక తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు.
Karuppu: సూర్య ‘కరుప్పు’ రిలీజ్ కి అడ్డంకులు.. కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు బాలాజీ
కొచ్చి షూటింగ్ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ రష్మిక ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. అడవులు, జలపాతాల మధ్య ట్రెక్కింగ్‌లు చేస్తూ, వర్షంలో తడుస్తూ గడిపిన రోజులు ఎంతో కొత్త శక్తిని ఇచ్చాయని తెలిపారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని, ఆ సమయంలో మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా పోరాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు. ఉదయాన్నే నిద్రలేవడం నుంచి అక్కడి స్థానిక వంటకాలను ఆస్వాదించడం వరకు ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమని వివరించారు.
రష్మిక(Rashmika Mandanna) సాహసాన్ని చూసి దర్శకుడు రవీంద్ర పుల్లె సైతం ప్రశంసల వర్షం కురిపించారు. గాయాలైనప్పటికీ ఏమాత్రం విరామం తీసుకోకుండా ఆమె షూటింగ్‌లో పాల్గొనడం చూసి యూనిట్ అంతా షాక్ అయ్యింది. ప్రస్తుతం ‘మైసా’ సెట్స్ నుంచి ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎత్తులంటే భయపడే అమ్మాయి నుంచి 80 అడుగుల పైనుంచి దూకే స్థాయికి రష్మిక ఎదిగిన తీరును చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే మైసా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
