Rashmika Mandanna lip kiss to bollywood hero in aeroplane
Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న.. నెట్టింట ఏదో విధంగా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక హీరోకి విమానంలో లిప్ కిస్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ వస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ ఫోటో అసలు ఎక్కడిది..?
రష్మిక మందన్న ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే సినిమాలో ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రష్మిక, రణబీర్ కి లిప్ కిస్ ఇస్తూ కనిపిస్తుంది.
Also read : Bubblegum Teaser : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌లాక్‌తో..
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ‘అమ్మాయి’ అనే సాగే ఈ సాంగ్ మెలోడీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇతర భాషల్లో కూడా ఈ పాటని రేపు విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీ రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే.. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని అర్ధమవుతుంది. అనిల్ కపూర్ రణబీర్ కి తండ్రిగా కనిపించబోతున్నాడు. బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.