Mysaa Teaser : ‘మైసా’ టీజర్ రిలీజ్.. వామ్మో రష్మిక మందన్న యాక్షన్ అదరగొట్టేసిందిగా..
మీరు కూడా మైసా టీజర్ చూసేయండి.. (Mysaa Teaser)
- Saketh U
- Updated on- September 20, 2026 / 07:50 PM IST
Rashmika Mandanna
Mysaa Teaser : రష్మిక మందన్న మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న సినిమా మైసా. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కేరళ బ్యాక్ డ్రాప్ గిరిజనుల కథాంశంతో యాక్షన్ సినిమాగా మైసా రానుంది. ఈ సినిమాలో రష్మిక అదిరిపోయే యాక్షన్ చేసింది అని, నీళ్లలో ఫైట్స్ చేసిందని, గాయాలు అయ్యాయని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
తాజాగా మైసా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే.. రష్మిక తన తండ్రి కోసం, తన వాళ్ళ కోసం పోరాటం చేస్తుందని తెలుస్తుంది. టీజర్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. రష్మిక ఎప్పుడూ చేయని ఓ కొత్త పాత్రలో కనిపించబోతుంది తెలుస్తుంది. ఇక మైసా సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది.
Also See : Sravya Dimple : కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన సేవ్ ది టైగర్స్ నటి.. ‘శ్రావ్య డింపుల్’ ఫొటోలు..
మీరు కూడా మైసా టీజర్ చూసేయండి..
