×
Ad

Allu Arjun- Rashmika: పుష్ప కాంబో రిపీట్.. కానీ హీరోయిన్ గా కాదు.. ఆడియన్స్ కి షాక్ ఇవ్వనున్న రష్మిక

అల్లు అర్జున్- అట్లీ సినిమాలో చేస్తున్న మరో స్టార్ బ్యూటీ రష్మిక(Allu Arjun- Rashmika).

Rashmika Mandanna playing villain role in Allu Arjun and Atlee film.

  • అల్లు అర్జున్- అట్లీ సినిమాలో రష్మిక ఎంట్రీ
  • విలన్ గా కనిపించనున్న నేషనల్ క్రష్
  • హీరోయిన్ కి మించి ఎలివేషన్స్ ఉంటాయని టాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 తరువాత అయాన ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన హోలీవుడ్ రేంజ్ ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని విజువల్స్ తో భారీ ఎత్తున రానున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ భారీ స్టూడియోలు పని చేస్తున్నాయి.

ఇక ఈ భారీ సినిమా కోసం కాస్టింగ్ ను కూడా అదే రేంజ్ లో సెట్ చేస్తున్నాడు అట్లీ. హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు అట్లీ. ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ ను తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో స్టార్ బ్యూటీ కూడా చేరింది.

Ram Charan: ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్ రా మావా.. ఆరంజ్ తో హారతి.. కాంపా డ్రింక్ తో అభిషేకం

ఆ బ్యూటీ మరెవరో కాదు రష్మిక మందన్న. అవును, అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం రష్మికను తీసుకున్నారట మేకర్స్. పుష్ప సినిమాలో ఇప్పటికే అల్లు అర్జున్- రష్మిక కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పడింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ మరోసారి అల్లు అర్జున్ సినిమాలో రష్మికను తీసుకున్నారట మేకర్స్.

అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కాకుండా విలన్ గా నటించనుందట. ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని సమాచారం. ఆ పాత్రకు రష్మిక అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు. అందుకే, ఆమె ఎంత బిజీగా ఉన్నా ఈ సినిమా కోసం విలన్ పాత్రలో చేయడానికి ఒప్పించారట మేకర్స్. ఇప్పటి వరకు హీరోయిన్ మెప్పించిన రష్మిక ఈ సినిమాలో విలన్ రోల్ లో అంతకన్నా ఎక్కువగా అలరిస్తుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.