Rashmika Mandanna : విజయ్ దేవరకొండపై రష్మిక అలక.. అందుకేనా?
హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ రష్మిక మధ్య రిలేషన్‌పై ఎన్నో వదంతులు జోరుగా షికారు చేశాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన ఈ స్టార్ జంట ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని గాసిప్‌లు వినిపించాయి.
- Saketh U
- Published On : September 6, 2023 / 01:43 PM IST
Rashmika Mandanna Possessiveness on Vijay Devarakonda in Samantha Issue
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండపై(Vijay Devarakonda) అలిగిందట. అందుకే ఖుషీ(Kushi) సినిమా రిలీజయి సక్సెస్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేలేదట. వేరే సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్న రష్మిక.. తన మనసుకు నచ్చిన స్నేహితుడు విజయ్ సినిమా ఖుషీని మాత్రం లైట్‌గా తీసుకోవడం టాలీవుడ్‌లో(Tollywood) హాట్‌టాపిక్ అవుతోంది.
హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ రష్మిక మధ్య రిలేషన్‌పై ఎన్నో వదంతులు జోరుగా షికారు చేశాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన ఈ స్టార్ జంట ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని గాసిప్‌లు వినిపించాయి. అయితే ఈ వదంతులను కొట్టిపడేసిన ఈ స్టార్ జంట.. తామిద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చారు. విజయ్‌తో రష్మిక షికార్లు చేయడం, ఒకే ఇంట్లో ఉన్న ఫొటోలు బయటకి వచ్చినా అదంతా స్నేహమే అన్నారు. ఇదే సమయంలో విజయ్ అభిమానులు మాత్రం రష్మికను వదినా అని పిలిస్తే సిగ్గుల మొగ్గవుతూ మురిసిపోయేది రష్మిక.
విజయ్‌తో కలిసి తిరగడాన్ని ఎంజాయ్ చేసిన రష్మిక ఈ మధ్య అతడివైపే చూడటం లేదని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ఖుషీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌కు దూరంగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. సినిమా రిలీజ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు రష్మిక దీనికి కారణం విజయ్‌పై ఆమె అలిగిందంటున్నారు. విజయ్ సోదరుడు ఆనంద్ నటించిన బేబీ సినిమా ప్రమోషన్ సందర్భంగా హడావుడి చేసిన రష్మిక.. ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
ఖుషీ ఆడియో రిలీజ్‌లో హీరో విజయ్ దేవరకొండ స్టార్ బ్యూటీ సమంతతో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడాన్ని రష్మిక సహించలేకపోతోందని చెబుతున్నారు. అంతేకాకుండా సినిమాలో కొన్ని రొమాన్స్ సీన్లలో కూడా సమంతతో హద్దుల్లేకుండా నటించడాన్ని, లిప్ కిస్ లు కూడా పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతోందట రష్మిక. తమ బంధంలో సమంత చిచ్చుపెడుతోందని రగిలిపోతోన్న రష్మిక విజయ్‌పై అలక వహించిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో?
