Rashmika Mandanna: పెళ్లి తరువాత జాక్ పాట్.. రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

పెళ్లి తరువాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna).

Star Heroine Rashmika Mandanna receiving huge remuneration in Bollywood

  • పెళ్లి తర్వాత రష్మిక భారీ రెమ్యునరేషన్
  • బాలీవుడ్‌లో రష్మికకు రూ.15 కోట్లు
  • మైండ్ బ్లాక్ చేస్తున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త గ్యాప్ తీసుకుంటారు, కానీ రష్మిక మాత్రం అస్సలు బ్రేక్ తీసుకోకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. తెలుగులో ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాలు చేస్తూనే, హిందీలో ‘కాక్‌టెయిల్ 2’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను చాటుకుంటోంది.

Bhumika Chawla: ఆరెంజ్ కలర్ చీరలో ‘ఖుషి’ బ్యూటీ.. భూమిక చావ్లా క్రేజీ ఫొటోస్ వైరల్!

సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, తన మార్కెట్ వాల్యూకు తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న రష్మిక, బాలీవుడ్‌లో మాత్రం దీనికి రెట్టింపు పారితోషికం అందుకుంటోంది. ఈ నెల 19న విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ సినిమాలో నటించిన సీనియర్ హీరోయిన్ కృతి సనన్‌కు సమానంగా జూనియర్ అయిన రష్మిక(Rashmika Mandanna)కు కూడా రూ. 15 కోట్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ ఇండస్ట్రీ నుండి ప్రస్థానం మొదలుపెట్టి టాలీవుడ్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్న రష్మికకు, ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాటు గతేడాది వచ్చిన ‘ఛావా’ సక్సెస్ ఉత్తరాదిలో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్ తోనే ప్రస్తుతం బాలీవుడ్‌లో మిడ్-రేంజ్ హీరోలకు సమానంగా రష్మిక పారితోషికం అందుకుంటూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.