Vijay Devarakonda – Rashmika : ముచ్చటగా మూడోసారి విజయ్ – రష్మిక జంటగా? శ్రీలీల ప్లేస్‌లో రష్మిక?

విజయ్ దేవరకొండ 12వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. VD 12 పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయి సినిమాపై ఆసక్తిని పెంచింది.

Rashmika Mandanna Replaced Sreeleela Place in Vijay Devarakonda VD 12 Movie

Vijay Devarakonda – Rashmika :  విజయ్ దేవరకొండ లైగర్(Liger) ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సమంతతో(Samantha) కలిసి ఖుషి(Kushi) అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి.

విజయ్ దేవరకొండ 12వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. VD 12 పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ బాగా వైరల్ అయి సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమం కూడా పూర్తయి షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీలీలనే. దాదాపు చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. దీంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక VD12 సినిమా వదిలేసుకుందని సమాచారం.

అయితే దీనిపై శ్రీలీల కాని, చిత్రయూనిట్ కాని అధికారికంగా స్పందించలేదు. తాజాగా VD12 సినిమా గురించి మరో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల తప్పుకున్నట్టు, శ్రీలీల ప్లేస్ లో రష్మికని తీసుకున్నట్టు తెలుస్తుంది. విజయ్ – రష్మిక ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని ఫుల్ గా వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ వీరు మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ అంతే అని చెప్తారు.

Also Read : Skanda : రామ్ స్కంద కోసం ఆసియాలోనే పెద్ద గేదెని తీసుకొచ్చిన బోయపాటి..

విజయ్ – రష్మిక పెయిర్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. VD12 లో నిజంగానే రష్మిక నటిస్తే ఇంకా హ్యాపీ, ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులని మెప్పిస్తారు అని అభిమానులు భావిస్తున్నారు. ఎప్పట్నుంచో వీరిద్దరూ కలిసి నటించాలని అభిమానులతో పాటు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే, లేదా చిత్రయూనిట్ స్పందించాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు