Skanda : దున్నపోతు కాదు.. రామ్ స్కంద కోసం ఆసియాలోనే పెద్ద గేదెని తీసుకొచ్చిన బోయపాటి..

ప్రస్తుతం స్కంద చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని చెప్తున్నాడు.

Skanda : దున్నపోతు కాదు.. రామ్ స్కంద కోసం ఆసియాలోనే పెద్ద గేదెని తీసుకొచ్చిన బోయపాటి..

Boyapati Brings Biggest Buffalo for Ram Pothineni Skanda Movie

Updated On : September 26, 2023 / 9:43 AM IST

Skanda Movie :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద(Skanda) సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రామ్ పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయాడు ఈ సినిమా కోసం.

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్ కి మంచి రీచ్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఇది బోయపాటి గత సినిమాలకి మించి ఉందని కామెంట్స్ వస్తున్నాయి. చాకోలెట్ బాయ్ గా ఉండే రామ్ అయితే పూర్తిగా మాస్ హీరోలా మారిపోయాడు. ప్రస్తుతం స్కంద చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని చెప్తున్నాడు.

Also Read : Shobu Yarlagadda : ప్రభాస్ మైనపు విగ్రహం.. వెంటనే తీసేయాలంటూ బాహుబలి నిర్మాత సీరియస్.. నెటిజన్స్ ట్రోల్స్..

ఈ సినిమాలో పెద్ద ఎద్దుని పట్టుకొని తీసుకొచ్చి రామ్ ఫైట్ చేసే సీన్ ని టీజర్ లో చూపించారు. ఇటీవల స్కంద ప్రమోషన్స్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ కి రాగా నాగార్జున దీని గురించి మాట్లాడాడు. దీనికి రామ్ సమాధానమిస్తూ.. అది అందరూ ఎద్దు అనుకుంటున్నారు. కానీ అది ఆసియాలోనే అతిపెద్ద గేదె. దాని బరువు 2 నుంచి 2.5 టన్స్ వరకు ఉంటుంది అని చెప్పాడు. అంటే దాదాపు 2000 కిలోల పైనే ఉంటుంది ఆ గేదె బరువు. బోయపాటి ఆ ఫైట్ సీన్ కోసం స్పెషల్ గా ఈ గేదెని తెప్పించినట్టు తెలుస్తోంది. అంత పెద్ద గేదెని షూటింగ్ లో మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడ్డారో.