Rashmika Mandanna shared an emotional post on pushpa 2 movie last day shooting
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ బ్యూటీ పుష్ప 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మూవీ టీమ్. ఇటీవల ట్రైలర్ సైతం రిలీజ్ చెయ్యగా నెట్టింట దుమ్ములేపుతుంది.
Also Read : Turning Point Teaser : ‘టర్నింగ్ పాయింట్’ టీజర్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్..
అయితే నిన్న పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్బంగా ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు. “ఈ నెల 24న పుష్ప షూటింగ్ చేసుకుని చెన్నైలో ఈవెంట్ కు వెళ్ళాం. అదే రోజు రాత్రి హైదరాబాద్ కు వచ్చాం. ఇంటికి వెళ్లి 4 నుంచి 5 గంటలు పడుకున్నా. తర్వాత రోజు ఉదయం లేచి పుష్ప సినిమాలో నా చివరి రోజు షూటింగ్ కు వెళ్లాను. ఆరోజు ఓ అద్భుతమైన సాంగ్ షూట్ చేసాము. పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలుసు.. కానీ ఏదో తెలియని బాధ. ఎందుకనేది ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. నా 7,8 ఏళ్ల కెరీర్లో గత 5 ఏళ్లు దాదాపు ఈ సినిమా సెట్ లోనే ఉన్నాను. అయినా కూడా ఇంకా పని మిగిలే ఉంది. పార్ట్-3 ఉంది. అది వేరే విషయం.. కానీ దీనికి ఇదే లాస్ట్ డే.
ఏదో తెలియని దుఃఖం. అన్ని ఎమోషన్స్ ఒకేసారి కలిసి వచ్చాయి. చాలా అలసిపోయాను. కానీ ఎంతో గర్వంగా కూడా ఉంది. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం, మనకు తెలియకుండానే వారితో బాండ్ ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ తో పాటు టీమ్ తో పనిచెయ్యడం చాలా హ్యాపీ గా ఉంది. వారితో ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. పుష్ప సెట్ నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది. 2024 నవంబర్ 25 చాలా కష్టమైన రోజు. ఇది ఎంతో విలువైన రోజుగా ఉంటుందని కోరుకుంటున్నా” అని రష్మిక ఎమోషనల్ అయ్యింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.