Vijay Deverakonda : మీలాంటి అన్నయ్య ఉండాలని కల.. విజయ్ దేవరకొండపై రష్మిక చెల్లి ఎమోషనల్ పోస్ట్..

తాజాగా శీమన్ మందన్న తన అక్క బావ పెళ్లి వేడుకల్లో తను సందడి చేసిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. (Vijay Deverakonda)

  • Published On : April 10, 2026 / 05:24 PM IST

Vijay Deverakonda

Vijay Deverakonda : విజయ్ దేవేరుకోండ – రష్మిక మందన్న ఇటీవల నెల రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలు ఓ రెండు వారాల పాటు కొనసాగాయి. ఇటీవల రెండు రోజుల క్రితం కూడా రష్మిక సొంతూళ్లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. విజయ్ – రష్మిక పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ గా మారాయి.

రష్మికకు 16 ఏళ్ళ గ్యాప్ తో ఒక చెల్లి ఉందని అందరికి తెలిసిందే. తన పేరు శీమన్ మందన్న. రష్మిక శీమన్ మందన్నని ఎక్కువగా బయట కన్పడనివ్వదు. అప్పుడప్పుడు తనకు ఒక చిట్టి చెల్లి ఉందని తనతో ఉండే అనుబంధం గురించి చెప్పేది. విజయ్ రష్మిక పెళ్లి ఫొటోల్లో కూడా శీమన్ మందన్న చాలా తక్కువగా కనిపించింది. తాజాగా శీమన్ మందన్న తన అక్క బావ పెళ్లి వేడుకల్లో తను సందడి చేసిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Also See : Shiman Mandanna : అక్క బావ పెళ్లి వేడుకల్లో శీమన్ మందన్న సందడి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన రష్మిక చెల్లి..

శీమన్ మందన్న తన పోస్ట్ లో.. పెళ్లికొడుకు నుండి సంగీత్, హల్దీ, మెహందీ, పెళ్లి, డిన్నర్ వరకు… ఇన్ని రోజులు ఫంక్షన్లు, సందడి, నవ్వులు, సంగీత్ ప్రాక్టీసులతో నిండిపోయాయి. ఇంత సరదా తర్వాత ఇవన్నీ ఇంత వేగంగా జరిగిపోయాక ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా భావోద్వేగాలను బయటపెట్టలేక కొన్నిసార్లు నా కళ్లలోంచి నీళ్లు కూడా వచ్చాయి. ప్రతి ఫంక్షన్‌కు హాజరవ్వడం కోసం స్కూల్ ఎగ్గొట్టడం, అటూ ఇటూ పరుగెత్తడం, అలసిపోవడం అయింది కానీ ఈ వేడుకలు మాత్రం అయిపోవాలనుకోలేదు.

ఇక మా బావగారికి మీరు నాకు బావగారు మాత్రమే కాదు నిజమైన సోదరుడిలా అయ్యారు. మీలాంటి సోదరుడు ఉండాలని నా కల. ఎన్నో జ్ఞాపకాలు, కొంచెం భావోద్వేగం, చాలా ప్రేమ ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. సంగీత్ కొరియోగ్రాఫర్‌లకు, వెడ్డింగ్ ప్లానర్‌లకు ధన్యవాదాలు. ఇది నిజంగా ఒక అద్భుతమైన పెళ్లి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also See : Zayn Marie Khan : ‘డెకాయిట్’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన అమీర్ ఖాన్ మేనకోడలు.. జైన్ మేరీ ఖాన్ ఫొటోలు..