The Girlfriend OTT: ఓటీటీలోకి వస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'(The Girlfriend OTT). నేటితరం కథాంశంతో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు.
- V Santhosh Kumar
- Published On : November 30, 2025 / 05:57 PM IST
Rashmika Mandanna The Girlfriend Movie OTT Streaming Date Out Now
The Girlfriend OTT: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend OTT)’. నేటితరం కథాంశంతో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేసిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమాలోని ఎమోషనల్ కాన్సెప్ట్ కు ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.
Buchi Babu Sana: మిత్రుడి ఐడియాతో పెద్ద హీరో సినిమా.. బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా అదేనా.. హీరో ఎవరో..
ఇక సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్న వేల ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో ఈ సినిమాను చాలా మంది చూసినప్పటికీ ఓటీటీలో కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
