Ravibabu: ఆరోజు బాలయ్య నన్ను తిట్టారు.. నేను కూడా ఊహించలేదు.. దర్శకుడు రవిబాబు కామెంట్స్ వైరల్

నందమూరి బాలకృష్ణపై దర్శకుడు రవిబాబు(Ravibabu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ravi Babu interesting comments about doing a film with Balakrishna

  • బాలయ్యపై రవిబాబుల ఆసక్తికర కామెంట్స్
  • సినిమా చేయమని బాలయ్య ఆఫర్.
  • క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు.

Ravibabu: నందమూరి బాలకృష్ణ, సీనియర్ నటుడు చలపతిరావు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల కాలం నాటిది. చలపతిరావు గారికి బాలయ్య అంటే తన సొంత కొడుకు కంటే ప్రాణం. ఎన్టీఆర్ కాలం నుండి ఆ అనుబంధం కొనసాగుతుంది. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా రేజర్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు, బాలకృష్ణ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Kiara Advani: నచ్చే చేశాను కానీ.. దయచేసి ఆ సీన్స్ డిలేట్ చేయండి.. టాక్సిక్ మేకర్స్ కి కియారా రిక్వెస్ట్

బాలకృష్ణ స్వయంగా రెండు మూడు సార్లు రవిబాబు(Ravibabu)ను పిలిచి, “నాతో సినిమా ఎప్పుడు చేస్తావు?” అని అడిగారట. ఒక స్టార్ హీరో స్వయంగా ఆఫర్ ఇవ్వడం రవిబాబు ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి. రవిబాబు ముందునుంచి విభిన్నమైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, బాలయ్య మాస్ ఇమేజ్‌కు మారుపేరు. వీరిద్దరి కాంబినేషన్ కుదిరితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతతో కేవలం వన్‌లైన్ ఆర్డర్‌తో సినిమాలు ఓకే చేయించుకున్న రవిబాబు క్లారిటీ, బాలయ్య ఎనర్జీ కలిస్తే అది ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది.

గతంలో కొన్ని కారణాల వల్ల ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కకపోయినా, ఇప్పటికీ కాలం మించిపోలేదని అభిమానులు నమ్ముతున్నారు. రవిబాబు మార్క్ వైవిధ్యం, బాలయ్య రేంజ్ మాస్ ఎలిమెంట్స్ కలిసిన కథ సిద్ధమైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. భవిష్యత్తులో ఈ ఇద్దరి కలయికలో ఒక ప్రయోగాత్మక మాస్ సినిమా రావాలని, అది చలపతిరావు గారికి నిజమైన నివాళిగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి రవిబాబుతో సినిమా చేయడంపావు బాలకృష్ణ ఆలోచనో ఏంటో తెలియాల్సి ఉంది.