Ravi Teja: దూకుడు మీదున్న మాస్ రాజా.. సెట్స్ మీదకి మరో సినిమా!
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తొలి బోణీ కొట్టింది..
- Naresh Mannam
- Published On : October 2, 2021 / 06:06 PM IST
Ravi Teja
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తొలి బోణీ కొట్టింది రవితేజనే. క్రాక్ సినిమాతో రవితేజ ఈ ఏడాది తొలి సక్సెస్ కొట్టడమే కాదు.. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకాన్ని కూడా కలిగించాడు. అక్కడ నుండి మొదలైన రవితేజ హవా వరస సినిమాలతో ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు.
ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా త్వరలోనే విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా ముమ్మర షూటింగ్ లో ఉంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే మరో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు.
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకు సిద్దమయ్యాడు. దీనికి సంబంధించిన చాలారోజులుగా డిస్కషన్ జరుగుతుండగా ఫైనల్ గా ఇప్పుడు అధికారిక ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 4 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనుండగా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొననున్నాడు. ఈ సినిమాలో రవితేజకి జోడి ఎవరన్నది ఖరారు కావాల్సివుండగా.. ఈనెలలోనే నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేయనున్నారు.
The action begins😎 #RT69 pic.twitter.com/v3S1SoyLQn
— Ravi Teja (@RaviTeja_offl) October 2, 2021
