Ravi Varma
Ravi Varma : వెన్నెల సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రవివర్మ ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రవివర్మ రాఖీ సినిమాలో ఎన్టీఆర్ బావ పాత్రలో నటించాడు. ఆ సినిమాలో కూడా రవివర్మది నెగిటివ్ రోల్. ఆ సినిమాతో రవివర్మ బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు.(Ravi Varma)
తాజాగా రవివర్మ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి, రాఖీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
రవివర్మ మాట్లాడుతూ.. రాఖీ సినిమా ఎన్టీఆర్, కృష్ణవంశీ గారి సినిమా అనే చేసాను. నాకు అసలు క్యారెక్టర్ కూడా తెలీదు వాళ్ళు చెప్పింది చేశాను. నా మొదటి సినిమా వెన్నెలకు ప్రివ్యూ వేస్తే కృష్ణవంశీ వచ్చారు. సినిమా చూసి బాగా చేసావు ఎన్నో సినిమా అనడిగితే మొదటి సినిమా అని చెప్పాను. దాంతో ఆయన ఆశ్చర్యపోయి సరే అయితే కలిసి పనిచేద్దాం అన్నారు. ఆయనే పిలిచి రాఖీ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో నన్ను మెయిన్ విలన్ గా పబ్లిక్ కి చూపించారు కానీ నేను అలా అనుకోలేదు. ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఆ సినిమా తర్వాత ఒకసారి మా ఊరికి వెళ్తే అక్కడ లేడీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసి వెళ్లి ఎన్టీఆర్ బావ అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఆ సినిమా చూసి మా చెల్లికి ఇలాంటోడు వస్తే ఎలా అని భయపడ్డారట.
ఎన్టీఆర్ ఒక లయన్ లాంటి వాళ్ళు. ఆయన పర్ఫార్మెన్స్ లయన్ లా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆయన నా దగ్గరికి వచ్చి ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అన్నారు. నేను గురువు గారు.. నాకు తెలీదు మీరు డైరెక్టర్ చూసుకోండి అని చెప్పా. ఆ రోజంతా నీ పని చెప్తా అని సరదాగా నన్ను ఆడుకున్నారు. నా బర్త్ డే రోజు అనుకోకుండా నా డెత్ సీన్ షూటింగ్ పెట్టారు. దానికి కూడా సరదా కౌంటర్లు ఇచ్చారు. ఎన్టీఆర్ గారు నా బర్త్ డే అని తెలిసి షూటింగ్ అయ్యాక కేక్ తెప్పించి సెలబ్రేషన్స్ చేసారు. ఎన్టీఆర్, కృష్ణవంశీ కేక్ లో నా తల ముంచేశారు ఆ రోజు అని అప్పటి సంగతులు చెప్పుకొచ్చాడు.