Raviteja Vs Ram : దసరాకు టైగర్ నాగేశ్వరరావు వర్సెస్ బోయపాటి మాస్.. పోటీపడబోతున్న రవితేజ, రామ్

ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.

Raviteja Vs Ram :  మన హీరోలు పండగల సీజన్స్ కి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావాలనుకుంటారు. పెద్ద పండుగలు ఉంటే కచ్చితంగా స్టార్ హీరోలంతా క్యూ కడతారు. ఇటీవల సంక్రాంతికి(Sankranthi) చిరంజీవి(Chiranjeevi), బాలయ్య(Balakrishna) ఇద్దరూ పోటీపడ్డారు. ప్రతి పండగకి కచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. పండగలప్పుడు హిట్ అయ్యే ఛాన్సులు, కలెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ సారి దసరా(Dasara)కు టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర జరగబోతోంది.

Raviteja and Ram Pothineni Clash at Box office for Dasara

దసరాకు ఇద్దరు హీరోల మధ్య టగ్ ఆఫ్ వార్ షూరూ కాబోతోంది. అందులో ఒకరు మాస్ మహారాజా అయితే మరో హీరో ఎనర్జిటిక్ స్టార్. ఇద్దరూ పక్కా మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి బరిలోకి దిగబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజుంది. రవితేజ ఆల్రెడీ మాస్ మహారాజ. ఇక రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో వచ్చిన మాస్ ఇమేజ్ ను అలాగే సస్టెయిన్ చేయాలని మాస్ సినిమాలతోనే ప్రయత్నిస్తున్నాడు. ది వారియర్ సినిమా పోయినా ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో తన నెక్స్ట్ మూవీని ఫిక్స్ చేసుకున్నాడు.

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత రవితేజ నటిస్తున్న మరో సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఒకప్పుడు ఆంధ్రా పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన పేరుమోసిన దొంగ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా భారీ స్కేల్‌లో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతోంది. 1970లో స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లోని పక్కా మాస్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అదే అక్టోబర్ 20వ తేదీన బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రూపొందుతున్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. రామ్ కెరీర్ లో ఇధి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా రవితేజకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అలా ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.

Nagababu : ఆరెంజ్ అప్పుడు ఫ్లాప్.. ఇప్పుడు రీ రిలీజ్ సూపర్ సక్సెస్.. నాగబాబు ఏమన్నాడో తెలుసా?

అయితే వీరితో పాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాతో అక్టోబర్ 19న రాబోతున్నాడు. కేవలం విజయ్ సినిమా అయితే తెలుగులో పట్టించుకునేవారు కాదు కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కావడంతో ఈ సినిమాపై కూడా తెలుగులో అంచనాలు ఉన్నాయి. ఇంకా దసరా టైం వరకు ఎవరన్నా హీరోలు తమ సినిమాలని లైన్ లో పెడతారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు