Raviteja – Baby : బేబీ మూవీకి రవితేజ ప్రశంసలు.. ఏమి అన్నాడంటే..!
యూత్ బ్లాక్ బస్టర్ మూవీ బేబీ పై రవితేజ ప్రశంసలు. యంగ్ ట్రైయో ఆనంద్, వైష్ణవి, విరాజ్ గురించి..
- gum 95921
- Published on- July 17, 2023 / 04:01 PM IST
Raviteja appreciation to youthful entertainer baby movie team
Raviteja – Baby : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుత జనరేషన్ లవ్ స్టోరీస్ ని బేస్ చేసుకొని తెరకెక్కింది. దీంతో యూత్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుండడంతో ఈ మూవీని సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తున్నారు.
Saindhav : ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ని పరిచయం చేసిన వెంకటేష్.. కథ మొత్తం ఈ పాత్ర చుట్టే..!
ఈ క్రమంలోనే మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రాన్ని చూశాడు. సినిమా బాగా నచ్చడంతో మూవీ టీం పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించాడు. ”బేబీ మూవీ చాలా బాగుంది. దర్శకుడు సాయి రాజేష్ టిపికల్ లవ్ స్టోరీని చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. విజయ్ బూల్గ్నిన్ ఈ సినిమాకి అందించిన సంగీతం చాలా బాగుంది. ఇక టాలెంటెడ్ అండ్ యంగ్ ట్రైయో ఆనంద్, వైష్ణవి, విరాజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. SKN కి కంగ్రాట్యులేషన్స్” అంటూ ట్వీట్ చేశాడు.
Ileana D’Cruz : మొత్తానికి ఇలియానా బాయ్ ఫ్రెండ్ని చూపించింది.. తన ప్రగ్నెంట్ సీక్రెట్ అతనేనా?
కాగా బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ రెండో రోజు కూడా ఆల్మోస్ట్ 7 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఏకంగా 14 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది బేబీ సినిమా. దీంతో మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి 23.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనకవసరం లేదు.
