Ileana D’Cruz : మొత్తానికి ఇలియానా బాయ్ ఫ్రెండ్‌ని చూపించింది.. తన ప్రగ్నెంట్ సీక్రెట్ అతనేనా?

పెళ్లి కాకుండానే ప్రగ్నెన్సీ, దానికి కారణం ఎవరో చెప్పకపోవడంతో ఇలియానాపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ చేస్తుంది.

Ileana D’Cruz : మొత్తానికి ఇలియానా బాయ్ ఫ్రెండ్‌ని చూపించింది.. తన ప్రగ్నెంట్ సీక్రెట్ అతనేనా?

Ileana D'Cruz shares Photos with her secret Boyfriend photo goes viral

Updated On : July 17, 2023 / 11:19 AM IST

Ileana D’Cruz :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ప్రగ్నెన్సీ, దానికి కారణం ఎవరో చెప్పకపోవడంతో ఇలియానాపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ చేస్తుంది. అభిమానులు, నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇటీవల ఒక అబ్బాయితో క్లోజ్ గా దిగిన ఫోటోని షేర్ చేసింది. కానీ ఈ ఫోటో బ్లర్ గా ఉండటంతో అందులో ఉన్నది ఎవరో తెలియలేదు. తాజాగా ఒక అబ్బాయితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఓ మూడు ఫోటోలని షేర్ చేస్తూ డేట్ నైట్ అని రాసి లవ్ సింబల్ వేసింది. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతనే, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఇలియానా షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.

Hari Hara Veera Mallu : ఏపీ ఎలక్షన్స్ పైనే మా సినిమా ఆధారపడి ఉంది.. బడ్జెట్ పెరిగింది.. హరిహర వీరమల్లు నిర్మాత AM రత్నం..

అయితే ఫోటో షేర్ చేసినా అతనెవరో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. గతంలో ఇలియానా కత్రినా కైఫ్ తమ్ముడితో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలియానా పోస్ట్ చేసిన ఫోటో మాత్రం అతను కాకపోవడంతో ఈ కొత్త వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అన్ని మెల్లి మెల్లిగా రివీల్ చేస్తున్న ఇలియానా అతని గురించి త్వరలో చెప్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.

Ileana D'Cruz shares Photos with her secret Boyfriend photo goes viral