Bhartha Mahasayulaku Wignyapthi : హమ్మయ్య.. మొత్తానికి ఓటీటీలోకి విచ్చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఎప్పుడు ఎక్కడ?
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది (Bhartha Mahasayulaku Wignyapthi)
- Saketh U
- Published On : March 9, 2026 / 01:36 PM IST
Bhartha Mahasayulaku Wignyapthi
Bhartha Mahasayulaku Wignyapthi : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సత్య, వెన్నెల కిషోర్, మురళీధర్, సునీల్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది
ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. ఇరువురి భామల మధ్య హీరో నలిగిన కామెడీ కథాంశంతో ఈ సినిమాని టీకెక్కించారు. అయితే సూపర్ హిట్ అయిన సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇంకా రాలేదేంటి అని ఆశ్చర్యపోతున్నారు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రైట్స్ జీ5 కొనుక్కుంది.
Also Read : ఒక పద్ధతి.. ఒక ప్లానింగ్.. ఒక విజన్.. ఈ సినిమాని చూసి టాలీవుడ్ వాళ్ళు నేర్చుకోవాలి..
పలు కారణాలతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పలుమార్లు వాయిదా పడగా ఎట్టకేలకు నేడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మార్చి 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Rashmika Mandanna : అప్పుడు మోకాళ్ళ నొప్పితో డాక్టర్ ని కలిసిన రష్మిక.. పెళ్లి తర్వాత మళ్ళీ..
