Raviteja : తండ్రి మల్టీప్లెక్స్‌కి కొబ్బరికాయ కొట్టిన కుమార్తె.. రవితేజ కూతుర్ని చూశారా ఎంత అందంగా ఉందో..
రవితేజ ప్రారంభించబోతున్న కొత్త బిజినెస్ కి కొబ్బరికాయ కొట్టిన కుమార్తె. రవితేజ కూతుర్ని చూశారా ఎంత అందంగా ఉందో.
- gum 95921
- Published on- April 15, 2024 / 09:45 PM IST
Raviteja daughter Mokshadha Bhupatiraju starts ART multiplex theater
Raviteja : మాస్ మహారాజ్ రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. సౌత్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకు వెళ్తున్న సంస్థ ‘ఏషియన్ సినిమాస్’. ఈ సంస్థ ఈ బిజినెస్ లో స్టార్ హీరోలకు భాగస్వామ్యం కల్పిస్తూ.. సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పటికే మహేష్ బాబుతో AMB, విజయ్ దేవరకొండతో AVD, అల్లు అర్జున్ తో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ లు ప్రారంభించి సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు తాజాగా రవితేజని తమ భాగస్వామ్యంగా చేసుకుంటూ దిల్‍సుఖ్‍నగర్ లో ఓ మల్టీప్లెక్స్ ని స్థాపిస్తున్నారు. ART పేరిట ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించనున్నారు. రీసెంట్ గా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంకి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ కూతురు మోక్షధ పాల్గొంది. సింపుల్ లుక్స్ లో కనిపించినా.. మోక్షధ తన నేచురల్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
Also read : Animal Park : ‘యానిమల్ పార్క్’ ఇప్పటిలో చేసేది లేదు.. సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్..
ఇక మోక్షధ ఫొటో చూసిన నెటిజెన్స్.. ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అంటూ నెట్టింట ప్రశ్నలు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రవితేజ కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.
రవితేజ సినిమాల విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఈ చిత్రం తరువాత తన 75వ సినిమాని ‘సామజవరగమన’ రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ కామెడీ ఎంటర్టైనర్ ని చేయబోతున్నారు.
