×
Ad

Raviteja : వరుస గాయాలు.. సర్జరీ.. పాపం రవితేజకు ఇంత జరిగిందా? అందుకే ఆలస్యం..

ఈ సినిమా ఆలస్యమవడానికి ముఖ్య కారణం రవితేజకు గాయాలు అవ్వడమేనట. (Raviteja)

Raviteja

Raviteja : మాస్ మహారాజ రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రవితేజ 75 వ సినిమా మాస్ జాతర మాత్రం పలు మార్లు వాయిదా పడింది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన సినిమా అక్టోబర్ 31 న రాబోతుంది. ఈ సినిమా ఆలస్యమవడానికి ముఖ్య కారణం రవితేజకు గాయాలు అవ్వడమేనట.(Raviteja)

గతంలో రవితేజకి మాస్ జాతర షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది, సర్జరీ జరిగింది అని వార్తలు వచ్చాయి. అయితే అదొక్కటే కాకుండా ఇంకో గాయం కూడా అయిందట. తాజాగా మాస్ జాతర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సినిమా ఎందుకు ఆలస్యం అయిందో చెప్పుకొచ్చాడు రవితేజ.

Also See : Manchu Manoj : భార్యతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..

రవితేజకి మొదట సాంగ్ షూటింగ్ సమయంలో భుజానికి ఇంజ్యూరీ అయి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్ లో కాలు ఇంజ్యూరీ అయిందని ఇన్ని ఇంజ్యూరీలు నాకు ఎప్పుడూ అవ్వలేదు అని తెలిపాడు. దీంతో మాస్ జాతర షూటింగ్ సమయంలో రవితేజ గాయాలతో బాగానే ఇబ్బంది పడ్డాడని, దాని వాళ్ళ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయి విడుదలకు లేట్ అయిందని తెలుస్తుంది.

Also Read : Mass Jathara : హమ్మయ్య ఇన్ని వాయిదాల తర్వాత ‘మాస్ జాతర’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..