Tiger Nageswara Rao : మొదటి వేటకు సిద్దమవుతున్న టైగర్ నాగేశ్వరరావు..
రవితేజ ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో స్టూవర్ట్‌పురం గజ దొంగ బయోపిక్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
- gum 95921
- Published On : January 13, 2023 / 12:04 PM IST
Tiger Nageswara Rao
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ విజయం తరువాత సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. మధ్యలో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలతో పరాజయాన్ని ఎదురుకున్న రవితేజ.. ధమాకా సినిమాతో మళ్ళీ హిట్టు ట్రాక్ లోకి ఎక్కాడు. ధమాకా చిత్రం రవితేజ 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు అందుకున్నాడు. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా కూడా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ ని సొంతం చేసుకొంది.
Dhamaka: మాస్ రాజా ఫ్యాన్స్‌కు ధమాకా లాంటి న్యూస్.. ఇక ఓటీటీలో రచ్చరచ్చే!
దీంతో వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ.. అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ 71వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 1970 కాలంలో స్టూవర్ట్‌పురం గజ దొంగగా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ లొకేషన్ లోని ఫోటోని షేర్ చేశారు మేకర్స్. అలాగే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, లేక వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు హింట్ ఇస్తూ.. ‘టైగర్ హంట్ లోడింగ్’ అంటూ ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. దీంతో జనవరి 26న రవితేజ పుట్టినరోజు కావడంతో, ఆ రోజు సినిమా నుంచి ఏదొక అప్డేట్ రాబోతుంది అని అభిమానులు సంబర పడుతున్నారు. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ భామలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
A MONUMENTAL schedule with a high octane action sequence wrapped up for #TigerNageswaraRao ?
TIGER HUNT LOADING…?
Stay tuned?@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @iam_RenuDesai @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @MayankOfficl @AAArtsOfficial pic.twitter.com/ouQIz0CE4q
— Abhishek Agarwal ?? (@AbhishekOfficl) January 12, 2023
