Raviteja : ‘అక్కాయిలు బాగున్నారా’.. అతనితో రవితేజ వెటకారం..?
ప్రస్తుతం రవితేజ ఇరుముడి సినిమా చేస్తున్నాడు. (Raviteja)
- Saketh U
- Published on- April 27, 2026 / 09:55 AM IST
Raviteja
Raviteja : రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నా విజయాలు మాత్రం అడపాదడపా అందుకుంటున్నాడు. అప్పుడెప్పుడో ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తర్వాత మొన్న సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పర్వాలేదనిపించారు. ప్రస్తుతం రవితేజ ఇరుముడి సినిమా చేస్తున్నాడు. ఇందులో అయ్యప్ప స్వామి డివోషనల్ టచ్ ఉండటం, రవితేజ అయ్యప్ప మాలలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ లాంటి మంచి సినిమాలను అందించిన డైరెక్టర్ హసిత్ గోలి తో రవితేజ సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. హసిత్ గోలి చేసిన రెండు సినిమాలు బాగుంటాయి. ఒకటి కమర్షియల్ హిట్ అవ్వగా ఒకటి ప్రశంసలు అందుకుంది.
Also Read : Arjun kalyan : హీరో అన్నాడు.. కట్ చేస్తే డబ్బులతో పారిపోయాడు.. అర్జున్ కళ్యాణ్ ని మోసం చేసిన డైరెక్టర్..
హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ స్టైల్ వెటకారంతో సినిమా ఉండబోతుందట. ఈ సినిమాకు ‘అక్కాయిలు బాగున్నారా..’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ ఆసక్తికర టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది. టైటిల్ కి తగ్గట్టు రవితేజ వెటకారం జతకూడితే మాస్ మహారాజ హిట్ కొట్టొచ్చు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
