Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
మాస్‌రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ...
- Anil Aaleti
- Published on- May 26, 2022 / 11:48 AM IST
Raviteja Ramarao On Duty Release Postponed
Raviteja: మాస్‌రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని రవితేజ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికితోడు రవితేజ లాస్ట్ మూవీ ఖిలాడి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఈసారి తమ అభిమాన హీరో ఎలాగైనా హిట్ కొట్టాలని వారు గట్టిగానే కోరుతున్నారు.
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
అయితే షూటింగ్ ముగించుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వారందరికీ చిత్ర యూనిట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూన్ 17న రిలీజ్ కావడం లేదంటూ వారు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతుందని.. అందుకే ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడంలేదని వారు వెల్లడించారు. ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా అద్భుతంగా తీర్చేందుకే తాము ప్రయత్నిస్తున్నామని.. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న దానికంటే కూడా ఆలస్యం అవుతున్నాయని వారు తాజాగా తెలిపారు.
Raviteja: తొలి పాటను వదులుతున్న రామారావు!
దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా తప్పడం లేదని వారు అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మాస్ రాజా ఈసారి వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్నట్లుగా ఈ చిత్ర టీజర్లో చూపించడంతో, ఈ సినిమాను తప్పకుండా చూడాలని వారు అనుకుంటున్నారు. మరి జూన్‌లో వాయిదా పడ్డ రామారావు, తిరిగి డ్యూటీ ఎప్పుడు ఎక్కుతాడా అని రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో దివ్యాంషా కౌశిక్, రాజీషా విజయన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
