Raviteja: తొలి పాటను వదులుతున్న రామారావు!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ.....

Raviteja: తొలి పాటను వదులుతున్న రామారావు!

Raviteja Ramarao On Duty First Single Song Announcement Today

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ఖిలాడి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మాస్ రాజా. అయితే ఈసారి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు రవితేజ.

Raviteja: రామారావు ఆన్ డ్యూటీ నుండి అదిరిపోయే సర్‌ప్రైజ్!

కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని ఫస్ట సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఏప్రిల్ 7న సాయంత్రం 4.05 గంటలకు రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

రవితేజ సరికొత్త లుక్‌తో నటిస్తున్న ఈ సినిమాలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సామ్.సిఎస్ సంగీతం అందిస్తుండగా, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 17న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో తొలి సింగిల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే ఇవాళ సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Ramaraoonduty

Ramaraoonduty