Jio vs Airtel : జియో, ఎయిర్టెల్ చీపెస్ట్ ప్లాన్లు.. రూ. 199 రీఛార్జ్ ప్లాన్ ఒకటే.. బెనిఫిట్స్ బోలెడు.. ఇందులో ఏది బెటర్?
Jio vs Airtel : జియో లేదా ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ ఆఫర్.. రూ. 199 ప్లాన్ ఒకే ధర ఉన్నా ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? పూర్తి ప్లాన్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Jio vs Airtel ( Image Credit : AI ChatGPT)
- జియో 18 రోజులు రోజుకు 1.5GB డేటా, జియోటీవీ జియోఏఐక్లౌడ్ యాక్సెస్
- ఎయిర్టెల్ 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, అదనపు బెనిఫిట్స్
- రోజువారీ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ, కాలింగ్ కోసం ఏది బెస్ట్?
Jio vs Airtel : రిలయన్స్ జియో, ఎయిర్టెల్ యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్లు.. రూ. 200 లోపు సరసమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం, ఈ రెండు టెలికాం ఆపరేటర్లు రూ. 199 ధరకే రీఛార్జ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి యూజర్లు భారీగా డేటా, వ్యాలిడిటీ బెనిఫిట్స్ పొందవచ్చు. జియో ప్లాన్ (Jio vs Airtel) ద్వారా ఫ్రీ యాక్సెస్‌తో పాటు ఎక్కువ వ్యాలిడిటీ పొందవచ్చు. ఎయిర్టెల్ ప్లాన్ కొంచెం ఎక్కువ డేటా లిమిట్ యూజర్లకు బెటర్. జియో రూ. 199, ఎయిర్టెల్ రూ. 199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో ఏది బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 199 రీఛార్జ్ ప్లాన్ 18 రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి యూజర్ రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. మొత్తం ప్లాన్ వ్యవధిలో 27GB పొందవచ్చు. రోజువారీ లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.
Read Also : Samsung Galaxy M47 : శాంసంగ్ కొత్త బీస్ట్ ఎంట్రీ.. Galaxy M47 ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ ఉన్నాయి. టెలికాం బెనిఫిట్స్ పాటు, జియో కొన్ని యాప్‌లు, సర్వీసులకు యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ఈ రీఛార్జ్‌తో సబ్స్క్రైబర్లు జియోటీవీ, జియోఏఐక్లౌడ్కు యాక్సెస్ పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్టెల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో ప్లాన్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్యాక్‌లో రోజువారీ డేటా బెనిఫిట్స్ కాకుండా మొత్తం వ్యాలిడిటీ కాలానికి 2GB డేటా అందిస్తుంది.
వ్యాలిడిటీ కోసం అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, 300 SMS బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఎయిర్టెల్ అదనంగా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ‘ది సేఫ్ నెట్వర్క్’ ఫీచర్ ద్వారా స్పామ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. 28 రోజుల పాటు అన్లిమిటెడ్ 5G డేటా, రోజుకు 2GB డేటా కోరుకునే యూజర్లకు టెలికాం కంపెనీ రూ. 349 రీఛార్జ్‌ను అద్భుతమైన ఆప్షన్ అందిస్తోంది.
జియో, ఎయిర్టెల్ (రూ. 199) ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో, ఎయిర్టెల్ ఒకే రూ.199 ధరకు ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏ ప్లాన్ ఎంచుకోవాలి అంటే చెప్పడం కష్టమే. కానీ, రోజువారీ డేటా లేదా వాయిస్ కాల్స్‌తో పాటు వ్యాలిడిటీకైనా తీసుకోవచ్చు.
మీ రోజువారీ డేటా కావాలంటే జియో రూ. 199 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజూ సగటున 1.5GB డేటాను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్ కోసం ఎయిర్టెల్ రూ. 199 టాప్-అప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలం 28 రోజులు ఉంటుంది. మొబైల్ డేటా కాకుండా కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే అవసరమయ్యే వారికి బెస్ట్ ప్లాన్.
