Samsung Galaxy M47 : శాంసంగ్ కొత్త బీస్ట్ ఎంట్రీ.. Galaxy M47 ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Samsung Galaxy M47 : కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M47 మోడల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ గీక్ బెంచ్ లిస్టులో కనిపించింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy M47 : శాంసంగ్ లవర్స్ కోసం ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ M47 ఫోన్ రాబోతుంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ బెంచ్‌మార్క్ లిస్టింగ్ ద్వారా లాంచ్ వివరాలు రివీల్ అయ్యాయి.

ఈ ఫోన్లో 8GB ర్యామ్, క్వాల్కామ్ చిప్సెట్ ఉంటుంది. ఇందులో అడ్రెనో 710 జీపీయూ కూడా ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్లు కూడా వెల్లడయ్యాయి. కొరియన్ కంపెనీ కొత్త ఫోన్, శాంసంగ్ గెలాక్సీ M47 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

రాబోయే శాంసంగ్ గెలాక్సీ M47 ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ M44 ఫోన్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పటికే కొత్త శాంసంగ్ మోడల్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. మోడల్ నంబర్ SM-M476Bగా కనిపిస్తోంది.

అంతేకాదు.. ఈ గెలాక్సీ M47 ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్లో 8GB ర్యామ్ ఉంటుందని తెలుస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో రన్ అవుతుందని అంచనా.

ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌లో 2.40GHz క్లాక్ స్పీడ్‌తో 4 పెర్ఫార్మెన్స్ కోర్లు, 1.80GHz క్లాక్ స్పీడ్‌తో 4 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్లో అడ్రెనో 710 జీపీయూ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఈ ఫోన్ గతంలో సింగిల్ IMEI లిస్టింగ్‌లో కూడా కనిపించింది.

శాంసంగ్ గెలాక్సీ M47లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే 5G కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయని అంచనా. 6000mAh వరకు భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఆకట్టుకునేలా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ M44తో పోలిస్తే ఇందులో 5000mAh భారీ బ్యాటరీ సహా మరెన్నో అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
