Dasara School Holidays : విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఈసారి ఏకంగా 13రోజులు సెలవులు..
Dussehra School Holidays : బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలకు సెలవుల తేదీలను ప్రకటించింది.
Dasara Holidays for Schools in Telangana From October 10-22
Telangana Dasara School Holidays : అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సగం రోజులు సెలవులు రానున్నాయి. మరికొద్ది రోజుల్లో పండుగల సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ బతుకమ్మ, దసరా సెలవులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించేలా విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో దసరా వేడుకలతో పాటు బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 2026లో బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమై, సద్దుల బతుకమ్మ అక్టోబర్ 18న జరగనుంది. ఇక విజయదశమి అక్టోబర్ 20వ తేదీన (మంగళవారం) నిర్వహించుకోనున్నారు. దీంతో అక్టోబర్ 22వ తేదీ వరకు తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. 23వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
దసరా సెలవులకు ముందు తెలంగాణ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్మెంట్–1 (SA-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే, పరీక్షల నిర్వహణలో భాగంగా తరగతుల వారీగా వేర్వేరు సమయాలను విద్యాశాఖ కేటాయించింది. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచి బతుకమ్మ, దసరా పండుగల సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లెక్కిస్తే మొత్తం 13 క్యాలెండర్ రోజులు సెలవులు రానున్నాయి.
తరగతుల వారిగా పరీక్షల సమయాలు..
♦ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు : ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
♦ 6, 8వ తరగతుల విద్యార్థులకు : ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
♦ 7వ తరగతి విద్యార్థులకు : మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
♦ 9వ తరగతి విద్యార్థులకు : మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
♦ 10వ తరగతి విద్యార్థులకు : ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
