Samsung Galaxy M47 : శాంసంగ్ కొత్త బీస్ట్ ఎంట్రీ.. Galaxy M47 ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Samsung Galaxy M47 : కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M47 మోడల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ గీక్ బెంచ్ లిస్టులో కనిపించింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

1/7
Samsung Galaxy M47 : శాంసంగ్ లవర్స్ కోసం ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ M47 ఫోన్ రాబోతుంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ బెంచ్‌మార్క్ లిస్టింగ్ ద్వారా లాంచ్ వివరాలు రివీల్ అయ్యాయి.
2/7
ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, క్వాల్‌కామ్ చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో అడ్రెనో 710 జీపీయూ కూడా ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్లు కూడా వెల్లడయ్యాయి. కొరియన్ కంపెనీ కొత్త ఫోన్, శాంసంగ్ గెలాక్సీ M47 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
3/7
రాబోయే శాంసంగ్ గెలాక్సీ M47 ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ M44 ఫోన్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పటికే కొత్త శాంసంగ్ మోడల్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. మోడల్ నంబర్ SM-M476Bగా కనిపిస్తోంది.
4/7
అంతేకాదు.. ఈ గెలాక్సీ M47 ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు రివీల్ అయ్యాయి. గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్ ఉంటుందని తెలుస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో రన్ అవుతుందని అంచనా.
5/7
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌లో 2.40GHz క్లాక్ స్పీడ్‌తో 4 పెర్ఫార్మెన్స్ కోర్లు, 1.80GHz క్లాక్ స్పీడ్‌తో 4 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్‌లో అడ్రెనో 710 జీపీయూ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఈ ఫోన్ గతంలో సింగిల్ IMEI లిస్టింగ్‌లో కూడా కనిపించింది.
6/7
శాంసంగ్ గెలాక్సీ M47లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 5G కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయని అంచనా. 6000mAh వరకు భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఆకట్టుకునేలా ఉంటుంది.
7/7
శాంసంగ్ గెలాక్సీ M44తో పోలిస్తే ఇందులో 5000mAh భారీ బ్యాటరీ సహా మరెన్నో అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.