Gold silver Price Today : ఆహా.. అదిరిపోయే శుభవార్త.. వరుసగా రెండోరోజు కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..
Gold silver Price Today : బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లోనే వెండి రేటు రూ.30వేలు తగ్గింది.

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశంలో గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వరుసగా రెండోరోజూ ధరలు తగ్గాయి.

బంగారం, వెండిని ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రకటన తరువాత భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.980 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.900 తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే 10గ్రాముల గోల్డ్ పై సుమారు రూ.15వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 30 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,715 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

భారత దేశంలో వెండి ధరసైతం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం కిలో వెండిపై రూ.10వేల తగ్గగా.. ఇవాళ (శనివారం) కిలో వెండిపై రూ.15వేలు తగ్గింది. గడిచిన మూడు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 30వేలు తగ్గుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,930 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,850 వద్దకు కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,57,080కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,43,850 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
