Rayalaseema : తెరపై మళ్ళీ రాయలసీమ.. అది పట్టుకుంటే చాలు హిట్టే..

ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చి హిట్ కొడుతుండటంతో చర్చగా మారింది. (Rayalaseema)

  • Published on- July 14, 2026 / 06:45 AM IST

Rayalaseema

Rayalaseema : ఒకప్పుడు టాలీవుడ్ లో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు అన్ని ఆల్మోస్ట్ హిట్టే. బాలయ్య బాబు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసుకొచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయి. వెంకటేష్, చిరంజీవి కూడా ఇంద్ర, జయం మనదేరా, తులసి.. లాంటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలతో వచ్చి అదరగొట్టారు. 1995 – 2010 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అంతఃపురం లాంటి యాక్షన్, ఫ్యాక్షన్, సీమశాస్త్రి లాంటి కామెడీ జానర్స్ లో అనేక సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. మర్యాద రామన్న తర్వాత ఆ హవా తగ్గింది.

ఆ తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ కి కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చి హిట్ కొడుతుండటంతో చర్చగా మారింది. ఇటీవల సమంత మా ఇంటి బంగారం సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సమంత ఆ యాస మాట్లాడి హిట్ కొట్టింది. తాజాగా అక్కినేని అఖిల్ కూడా లెనిన్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే తీసుకువచ్చాడు. అఖిల్ కూడా చిత్తూరు యాసలో మాట్లాడి మెప్పించాడు. లెనిన్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Shruti Haasan : తల్లితండ్రులు లేకుండానే.. కొత్తింట్లోకి గృహప్రవేశం చేసుకున్న శృతి హాసన్..

ఇలా బ్యాక్ టు బ్యాక్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చి హిట్ కొట్టడంతో మళ్ళీ ఆ పంథా సినిమాలపై ఆసక్త్ నెలకొంది. విజయ్ దేవరకొండ రాబోయే రణబాలి సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే. అనిల్ రావిపూడి రాబోయే సినిమా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ల సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్, కామెడీతో ఉండబోతుంది. ఈ సినిమా ఎలాగో హిట్ అని అందరికి తెలుసు. ఇలా వరుసగా రాయలసీమ సినిమాకు క్యూ కట్టాయి టాలీవుడ్ లో.

రాయలసీమ యాస ని పర్ఫెక్ట్ గా పట్టుకొని కరెక్ట్ గా మాట్లాడితే చాలు జనాలకు కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని అనుకుంటున్నారు. మరి రాబోయే రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా హిట్ కొట్టేస్తే మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వరుసగా రావడం ఖాయం.