Rayavalasa : మా ఊరు రాయవలస సాంగ్ విన్నారా? విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్..
మీరు కూడా ఈ పాటను వినేయండి..(Rayavalasa)
- Saketh U
- Published on- October 25, 2026 / 12:29 PM IST
Rayavalasa
Rayavalasa : కార్తీక్ జయంతి, శ్రీష నులు జంటగా రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాయవలస’. అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా రాయవలస నుంచి రెండో పాటని విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాట విడుదల అయింది. అర్జున్ బాల సంగీత దర్శకత్వంలో కార్తీక్ జయంతి రాయగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాయవలస కంటెంట్ బాగుంది. సాంగ్ బాగుంది. రాహుల్ అద్భుతంగా పాడాడు. మూవీ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..
ఇక ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ఆంధ్రా పల్లెటూరి జానపద పాట ‘రింగుడు రింగుడు’ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికతో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాయవలస సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.
