RC 17 : చరణ్‌కు జోడీగా రష్మిక.!

రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వస్తున్న కొత్త సినిమా RC17పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ నెలకొంది.

RC 17 Film Sparks Rashmika Casting Buzz

RC 17 : రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబోలో వస్తున్న కొత్త సినిమా RC17పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ నెలకొంది. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, త్వరలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముందని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో రష్మిక మందన్నా పేరు బలంగా వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక నటించిన పుష్ప సినిమా..ఆమెకు ఓ రేంజ్‌ క్రేజ్ తెచ్చిపెట్టింది. రష్మికకు ఆల్రెడీ నేషనల్ ఎక్స్‌పోజర్ ఉండటం..ఆమె యాక్టింగ్‌ స్కిల్స్‌ కూడా స్క్రిప్ట్‌కు సెట్‌ అవుతాయనే అంచనాతో..చరణ్‌కు జోడిగా రష్మికను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

Gautam Ghattamaneni : ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న మ‌హేశ్‌బాబు కొడుకు.. గౌతమ్ ఫోటోలు వైర‌ల్‌

సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రయారిటీ ఉంటుంది. రంగస్థలంలో సమంత పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉండిందో, అలాగే ఈ సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక అయితే ఆ రోల్‌కు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

కొందరు అయితే మరో హీరోయిన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. చరణ్, రష్మిక జోడీ ఫిక్స్ అయితే అది ఫ్రెష్ కాంబినేషన్ అవ్వడంతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో మంచి క్రేజ్ తెచ్చే అవకాశముందంటున్నారు. కానీ అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇది కేవలం ఇండస్ట్రీ గాసిప్‌గానే చూడాలి.