reason behind allu arjun Pushpa 2 movie trailer event in Patna was such a big success
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకోసం భారీ ప్లానింగ్ వేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే పుష్ప 2 ట్రైలర్ ను పెద్దఎత్తున విడుదల చేశారు. ఎవ్వరూ ఉహించని విధంగా, ఇప్పటివరకు ఏ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగని విధంగా పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ను పెద్దెత్తున నిర్వహించారు.
Also Read : Devi Sri Prasad : దేవిశ్రీ పుష్ప ప్రమోషన్స్ కి వస్తాడా.. పుష్ప 2 లో అతని పాత్ర ఎంత..
బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలా వేరే రాష్ట్రంలో ఈవెంట్ చెయ్యడానికి ఎవ్వరూ సాహసం చెయ్యరు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా పుష్ప టీమ్ దీన్ని సాధించారు. హైదరాబాద్ నుండి పది రోజుల ముందే పాట్నా వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకొని రాత్రి, పగలు అనే తేడా లేకుండా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ కోసం అక్కడి అధికారుల చుట్టూ తిరిగారు. ఈవెంట్ సక్సెస్ కోసం మైత్రి సాయి, యువీ మీడియా వెంకట్ అండ్ టీమ్ కీలకంగా పనిచేశారు.
బిహర్ లాంటి స్టేట్ లొ పాట్నా లాంటి రాజధాని లొ తెలుగు సినిమా ఈవెంట్ చేయ్యాలి అనే ఆలొచనే కష్టం.. ఇండియన్ సినిమా చరిత్ర లొ ఇప్పటి వరకూ ఎవ్వరూ సాహసించలేదు..వాళ్ళకి ఆలొచన కూడా రాలేదు.. అలాంటిది ఆలొచన రావటమే తరువుగా హైదరాబాద్ నుండి పది రొజుల ముందే పాట్నా చేరుకుని… pic.twitter.com/UvbFP9hzyO
— Eluru Sreenu (@IamEluruSreenu) November 19, 2024
పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడంకోసం వీరు అహర్నిశలు కష్టపడ్డారు. ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళంతా ఈవెంట్ ని ప్రశాంతంగా చూడలేదట. మైత్రి సాయి, యువీ మీడియా వెంకట్ అండ్ టీమ్ అందరూ కలిసి పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ను భారీఎత్తున సక్సెస్ చేయడంలో కీలక భూమిక పోషించారు. తద్వారా ఇండియాలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి రికార్డు బ్రేక్ చేశారు.