Devi Sri Prasad : దేవిశ్రీ పుష్ప ప్రమోషన్స్ కి వస్తాడా.. పుష్ప 2 లో అతని పాత్ర ఎంత..

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రతేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలకి తన అద్భుతమైన మ్యూజిక్ అందించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సినిమాలకి కూడా మ్యూజిక్ అందిస్తుంటాడు డీఎస్పీ.

Devi Sri Prasad : దేవిశ్రీ పుష్ప ప్రమోషన్స్ కి వస్తాడా.. పుష్ప 2 లో అతని పాత్ర ఎంత..

Will music director Devi Sri Prasad come to Pushpa promotions What will be his role in Pushpa 2 movie

Updated On : November 19, 2024 / 12:32 PM IST

Devi Sri Prasad : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రతేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలకి తన అద్భుతమైన మ్యూజిక్ అందించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సినిమాలకి కూడా మ్యూజిక్ అందిస్తుంటాడు డీఎస్పీ. అయితే తాజాగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.

ఇకపోతే తమిళ హీరో సూర్య నటించిన కంగువా సినిమాకి కూడా మ్యూజిక్ అందించాడు డీఎస్పీ. అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. సినీ ఆడియన్స్ చాలా మంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాలేదని, తల నొప్పి వచ్చిందని కామెంట్స్ చేశారు. మరోవైపు .. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం పుష్ప 2 సినిమాలో కొంతమేరకు భాగమైనట్టు తెలిపారు. వీరితో పాటు మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమా కోసం పనిచేశారట. అయితే ఈ అన్ని వార్తలు ఒకేసారి బయటి రావడంతో అసలు పుష్ప 2 లో డిఎస్పీ పాత్ర ఎంతమేరకు ఉంది? అసలు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన కనిపిస్తారా? అన్న ఈ వార్తలన్నిటికీ చెక్ పెడతారా లేదా అన్నది చూడాలి.

Also Read : Nazriya Nazim : ‘మా ఆయన అసలైన పర్ఫార్మెన్స్ పుష్ప 2లో చూస్తారు’.. నజ్రియా ఆసక్తికర కామెంట్స్..

నిజానికి ఒక సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా, పెద్దా అన్ని ప్రొమోషన్ ఈవెంట్స్ కి వస్తారు. కానీ డీఎస్పీ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసారు. త్వరలోనే మరిన్ని ప్రమోషన్స్ చెయ్యనున్నారు. ఈ ప్రమోషన్స్ కి వచ్చి తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెడితే బాగుంటుందని అంటున్నారు సినీ ఆడియన్స్. నిజానికి పుష్ప 2 సినిమాలో పాటలన్నీ కంపోజ్ చేసింది డీఎస్పీ. అలాగే తాజాగా అన్​స్టాపబుల్ షోకి వచ్చిన బన్నీ సైతం షోలో డీఎస్పీ కి కాల్ చేసి మాట్లాడారు.డీఎస్పీ బాలయ్యతో ఏదో సీక్రెట్ రివీల్ చేస్తా అంటే బన్నీ మధ్యలోనే ఆపేస్తాడు. కొంతమేర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం మాత్రమే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకున్నారట. కానీ ఎక్కువశాతం డీఎస్పీ నే పనిచేసినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలై డీఎస్పీ ఎలా స్పందిస్తాడో చూడాలి.