Nazriya Nazim : ‘మా ఆయన అసలైన పర్ఫార్మెన్స్ పుష్ప 2లో చూస్తారు’.. నజ్రియా ఆసక్తికర కామెంట్స్..
పుష్ప 2 ట్రైలర్ విడుదల చెయ్యడంతో చాలా మంది సినీ సెలబ్రిటీస్ తమ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని తమ బెస్ట్ విషెష్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

you will see his original performance in Pushpa 2 Fahadh Faasil wife Nazriya Nazim interesting comments
Nazriya Nazim : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చెయ్యగా యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ వన్ లో దూసుకుపోతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ఇటీవల పుష్ప 2 ట్రైలర్ విడుదల చెయ్యడంతో చాలా మంది సినీ సెలబ్రిటీస్ తమ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని తమ బెస్ట్ విషెష్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విషయాన్ని గురించి తెలుపుతూ ఫహాద్ భార్య నజ్రియా నజిమ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘‘పుష్ప 1 లో ఫహద్ యాక్టింగ్ కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘పుష్ప 2’లో ఆయన అసలైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులోనే ఆయన్ని పూర్తిగా చూస్తారు..’’ అంటూ పుష్ప 2 పై అంచనాలు పెంచేసింది.
Also Read : Pushpa 2 : ట్రైలర్ సక్సెస్ తర్వాత ఎంజాయ్ చేస్తున్న పుష్ప 2 టీమ్.. ఫోటోలు వైరల్
దీంతో తన భర్త పై నజ్రియా నజిమ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే పుష్ప 1లో భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు ఫహాద్. సెకండ్ హాఫ్ లో ఈయన కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో ఫహాద్, అల్లు అర్జున్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. పుష్ప 1 ఎండింగ్ లో ఫహాద్ క్యారెక్టర్ పుష్ప 2 లో మరింత కీలంగా ఉంటుంది అన్నట్టు చూపించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ఇది స్పష్టమౌతుంది. మరి ఇప్పటికే పుష్ప 1లో పార్టీ లేదా పుష్ప అని దుమ్ములేపిన ఫహాద్ పుష్ప 2 లో ఏం చేస్తాడో చూడాలి..