Pushpa 2 : ట్రైలర్ సక్సెస్ తర్వాత ఎంజాయ్ చేస్తున్న పుష్ప 2 టీమ్.. ఫోటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రానున్న పుష్ప 2 కోసం బన్నీ లవర్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్.

Pushpa 2 team enjoying after trailer success
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రానున్న పుష్ప 2 కోసం బన్నీ లవర్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్న ట్రైలర్ చూసి సంబరాలు చేసుకుంటున్నారు మూవీ టీమ్.
Also Read : Rocking Rakesh : తనపై చెయ్యి చేసుకున్నా.. స్టేజిపై భార్య గురించి చెప్తూ ఏడ్చేసిన రాకింగ్ రాకేష్..
అయితే తాజాగా పుష్ప 2 ట్రైలర్ చూసాక అంద్భుతంగా ఉందని పుష్ప మూవీ టీమ్ ని కలిశారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో ఫోటోలు దిగారు. ఇక ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘వైల్డ్ ఫైర్’ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో చంద్రబోస్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
#wildfire pic.twitter.com/fOzYBH4USa
— chandrabose (@boselyricist) November 18, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుండే పుష్ప సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు బన్నీ ఫాన్స్.