Rocking Rakesh : తనపై చెయ్యి చేసుకున్నా.. స్టేజిపై భార్య గురించి చెప్తూ ఏడ్చేసిన రాకింగ్ రాకేష్..

KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Rocking Rakesh : తనపై చెయ్యి చేసుకున్నా.. స్టేజిపై భార్య గురించి చెప్తూ ఏడ్చేసిన రాకింగ్ రాకేష్..

Rocking Rakesh Cried while Speaking about his Wife Sujatha in KCR Movie Pre Release Event

Updated On : November 19, 2024 / 10:23 AM IST

Rocking Rakesh : మిమిక్రి ఆర్టిస్ట్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా ఎదిగాడు రాకింగ్ రాకేష్. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు తనే హీరోగా, నిర్మాతగా KCR అనే సినిమా చేశాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

రాకింగ్ రాకేష్ నటి సుజాతని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Rana Daggubati : సినిమా కలెక్షన్స్ పై రానా సంచలన వ్యాఖ్యలు.. పోస్టర్స్ పై కలెక్షన్స్ రియల్ కాదు అంటూ..

రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. తనని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ. ఒక్కోసారి టెన్షన్ లో తనపై చెయ్యి చేసుకున్నా కూడా. తను నా కంటే పెద్ద ఆర్టిస్ట్. కానీ నన్నుఎప్పుడూ ఒక్క మాట కూడా అనకుండా ఏమండీ మీ వెనక నేనుంటా అని నమ్మిన నా భార్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. మాలలో ఉన్నా లేకపోతే నా భార్య కాళ్ళు మీ అందరి సమక్షంలో పట్టుకునేవాడ్ని. అంత గొప్ప వ్యక్తిత్వం నా భార్యది. నన్ను భరించడానికి మా అమ్మ తర్వాత నా ఇంట్లో అడుగుపెట్టింది. థ్యాంక్యూ సుజి. మనకు ఏం కాదు ఈ సినిమాతో బయటపడతాం. మళ్ళీ సినిమా చేస్తాం అంటూ ఏడ్చేశాడు. అలాగే ఈ సినిమాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్.